ఇండియాలో అతిపెద్ద రోడ్ షో చేయ‌నున్న‌ ట్రంప్, మోదీ..!

-

ఫేస్ బుక్ లో జుకర్ బెర్గ్ తనను నెం.1 గా, భారత ప్రధాని మోదీని నెం.2 గా పేర్కొనడంపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది జుకర్ తనకు ఇచ్చిన గౌరవమని అన్నారు. ‘ఎస్.. నిజానికి నేను రెండువారాల్లో ఇండియాకు వెళ్తున్నాను.. నా ఈ పర్యటన కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు. అవును! ఈ నెల చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి భారత్ లో పర్యటించనుండగా, అహ్మదాబాద్ లో 22 కిలోమీటర్ల దూరం జరిగే రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొంటారని నగర మేయర్ బిజాల్ పటేల్ వ్యాఖ్యానించారు.

దారి పొడవునా దాదాపు 50 వేల మంది వారికి స్వాగతం పలుకుతారని, ఇంత అధిక దూరం ప్రజలు నిలబడే అతిపెద్ద రోడ్ షో ఇదే కావచ్చని ఆయన అన్నారు. ఈ రోడ్ షోకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు హాజరై, తమతమ సంప్రదాయ ఆహార్యంలో కనిపిస్తారని ఆయన అన్నారు. కాగా, తన పర్యటనలో భాగంగా ట్రంప్ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఈ ఆశ్రమంతో మహాత్మా గాంధీకి ఎంతో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఆపై ట్రంప్, మోదీలు మొతేరాలో నిర్మించిన క్రికెట్ స్టేడియానికి చేరుకుని, అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news