చరణ్, బోయపాటి విచిత్రమైన టైటిల్

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా స్టార్ డైరక్టర్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా ఇన్నాళ్లు స్టేట్ రౌడీ అంటూ ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు మరో రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి వినయ విధేయ రామా.. మరోటి రౌడీ తమ్ముడు. ఈ రెండిటిలో వినయ విధేయ రామా అన్నది ఫిక్స్ అని అంటున్నారు.

బోయపాటి, రాం చరణ్ కాంబినేషన్ లో సినిమా అంటే ఆ అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు వీరు అనుకుంటున్న టైటిల్ కు ఏమాత్రం మ్యాచ్ అవలేదు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. వినయ విధేయ రామా అనే టైటిల్ దానయ్య తన బ్యానర్ లో రిజిస్టర్ చేయించాడట.

మరి చరణ్, బోయపాటి కలిసి చేస్తున్న ఈ సినిమా ఏదై ఉంటుందో చూడాలి. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ దసరా కానుకగా రాబోతుంది. 2019 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ మూవీతో చరణ్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news