ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని విశాఖ విమానాశ్రయం బయట పోలీసులు ఆపేయటం జరిగింది. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐదుసార్లు అరెస్టు చేశారు చంద్రబాబు ని. అయితే ఐదుసార్లు ఎక్కడా పెద్దగా సీరియస్ అవ్వని చంద్రబాబు విశాఖలో తనలో ఉన్న కోపాన్ని భయంకరంగా ప్రదర్శించారు. అసలు చంద్రబాబు అంత కోపం పడటానికి కారణం గురించి రకరకాల వార్తలు ఏపీ మీడియా సర్కిల్ లో వినపడుతున్నాయి. ఇది కావాలని చంద్రబాబు తనకు రాజకీయంగా మైలేజ్ రావడం కోసం చేస్తున్న డ్రామా అని వైకాపా నేతలు విశాఖ చంద్రబాబు ఘటనపై స్పందించడం జరిగింది. ఇదే తరుణంలో మరో పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలపై ఒకపక్క పోలీసులు మరోపక్క గుండాల చేత ముఖ్యమంత్రి జగన్ ఆడిస్తున్న నాటకమని ఆరోపించడం జరిగింది. ఏది ఏమైనా జరిగిన ఈ ఘటనలో చంద్రబాబు ఒక పోలీసు అధికారి పై ఒక్కసారిగా మీదకు వెళ్లే ప్రయత్నం చేసినట్టుగా రియాక్ట్ అవటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీనంతటికీ కారణం సదరు పోలీసు అధికారి బూమారంగ్ చంద్రబాబు ముఖానికి తగలడం అన్ని టాక్. అందువల్ల అతని టార్గెట్ చేసి వెనక పక్క ఉన్నాగాని చంద్రబాబు లేచి మీదకు వెళ్లే ప్రయత్నం చేశారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు తాజాగా కామెంట్ చేస్తున్నాయి. మామూలుగా అయితే నిరసన కలపాలి అనుకున్న చంద్రబాబుకి బూమారంగ్ దెబ్బ ముఖానికి గట్టిగా తగలటంతో ఓర్చుకోలేక ఒక్కసారిగా సదరు పోలీసు అధికారి సీరియస్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా ఆ తర్వాత సదరు పోలీసు అధికారి ని పిలిచి మరి చంద్రబాబు క్లాస్ పీకారట.