హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలెర్ట్. మరో రెండు రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని కోరింది వాతావరణ శాఖ. HYD సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. కొన్నిచోట్ల గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. మరో రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కొనసాగనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. మరోవైపు HYDలో నగరవాసులు పవర్ కట్, ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.