సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఏపీలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. : ‘స్వర్ణాంధ్ర-2047’ సంకల్పంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు ‘ఇ-చెక్’ థీమ్‌తో కార్యక్రమం చేపట్టనున్నారు. ఇ-వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయనున్నారు.

ఇ-చెక్ అంటే అన్ని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల్లోని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి రీయూజ్ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కేంద్రాల నిర్వహణకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని SHG సభ్యులను గుర్తించాలని వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ అనేది E-వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపునిచ్చారు.