హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో యువతి హల్ చల్ చేసింది. ఏఐజీ ఆసుపత్రి బిల్డింగ్ పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఆ యువతిని కిందకు దించడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కిందకు దిగాలని, సమస్య ఏంటో చెప్పాలని ఆసుపత్రి సిబ్బందితో పాటు, పోలీసులు ఎంత వేడుకున్నా చెప్పకుండా అలాగే నిల్చొని చూస్తోంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఐజీ ఆసుపత్రి బిల్డింగ్ లో సదరు యువతి కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నట్లు సమాచారం. సడన్ గా ఆమెను విధుల్లోంచి తొలగించడంతో తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.