హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. వీసా గడువు తీరినా చాలా మంది బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశస్తులు హైదరాబాద్ లో ఉన్నారని పేర్కొన్నారు. వీరందరినీ వెంటనే వెనక్కి పంపించాలని డిమాండ్ చేసారు. వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని.. గతంలో చాలా సందర్భాల్లో రుజువు అయిందని.. స్లీపర్ సెల్స్ కి హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని ఆరోపించారు.
దీంతో పాటు బీఆర్ఎస్ ఉత్సవాలపై కూడా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఏం సాధించిందని ఉత్సవాలు జరుపుతున్నారు..? యువరాజు కి పట్టం కట్టేందుకు ఉత్సవాలు చేస్తున్నారా..? బీఆర్ఎస్ రూలింగ్ లోనే కాదు.. ప్రతిపక్షంలో కూడా పెయిల్ అయిన పార్టీ అన్నారు. బీఆర్ఎస్ కి సేనాధిపతి తిరుగుబాటు తప్పదు అన్నారు. మిషన్ కోసం ఏర్పాటు చేసిన పార్టీ కమీషన్ లు తీసుకుంది. నాలుగు కోట్ల మంది కొరకు పార్టీ అని ఒక్క కుటుంబానికే పరిమితం చేశారని పేర్కొన్నారు.