టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ కి టీం ఇండియా…!

-

మహిళల టి20 ప్రపంచ కప్ లో మన మహిళల జట్టు ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ప్రపంచకప్ లో సెమి ఫైనల్ మ్యాచ్ మన మహిళల జట్టు నేడు ఆడనుంది. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఇంగ్లాండ్ తో తలపడుతుండగా… సిడ్నీ లో భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం ఆగే పరిస్థితి కనపడటం లేదు. దీనితో మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

మ్యాచ్ రద్దు అయితే మాత్రం పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ కి వెళ్తుంది. ఆ లెక్కన చూస్తే మన జట్టు అగ్ర స్థానంలో ఉంది కాబట్టి ఫైనల్ కి వెళ్ళడం ఖాయంగా కనపడుతుంది. అలాగే మరో మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా తలపడగా ఆ మ్యాచ్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ జట్లు లీగ్ మ్యాచుల్లో మంచి ప్రదర్శనతో ఫైనల్ కి అడుగుపెట్టాయి. దీనిపై మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news