ఆంధ్రప్రదేశ్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు గాను అధికార వైసిపి నలుగురు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సూచించిన పరిమళం నత్వాని అదేవిధంగా 2014 వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అయోధ్యరామిరెడ్డి పేర్లను జగన్ ఖరారు చేశారు.
ఈ నెలతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. జగన్ రాజ్యసభకు ఎవరిని పంపిస్తారు అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ప్రధానంగా నాలుగు పేర్లు ఎక్కువగా చర్చకు వచ్చాయి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ,వైయస్ షర్మిల పేర్లు చర్చకు వచ్చినా అది నిజం కాదు కేవలం ప్రచారం మాత్రమే అని ఈ ఎంపికతో అర్థమైంది .
సుబ్బిరామిరెడ్డి సీతారామలక్ష్మి అదేవిధంగా కే కేశవరావు రాజ్యసభ సభ్యత్వం ఈ నెలలో పూర్తి కానుంది.శాసనమండలిని రద్దు చేసిన నేపథ్యంలో పిల్లి సుభాష్ ,చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ భవితవ్యం ఏమవుతుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది అయితే వారిని రాజ్యసభకు పంపడానికి జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఉత్కంఠ వీడింది అనే చెప్పాలి.