వైసిపి పార్టీ అగ్రనేత విజయ సాయి రెడ్డి విశాఖపట్టణానికి సంబంధించిన మేయర్ పీఠంపై కన్నేయ్యటం జరిగింది. గత కొంత కాలం నుండి ఉత్తరాంధ్ర రాజకీయాలకు సంబంధించి వైసిపి పార్టీ వ్యవహారాలన్నీ ఎన్నికల ముందు నుండే చూసుకుంటున్న విజయసాయిరెడ్డి పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు. వైజాగ్ ప్రాంతానికి క్యాపిటల్ రావటానికి తీవ్రంగా అన్ని రకాలుగా కృషి చేసిన విజయసాయి రెడ్డి రాజకీయంగా ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా చక్కదిద్దారు. ఒకపక్క విశాఖ రాజకీయాలను మరోపక్క ఢిల్లీ రాజకీయాలను వైసీపీ పార్టీ తరఫున అంతా చూసుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవాలన్న కోరికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని సంప్రదించగా…కుదరదు అన్న లైట్ తీసుకో అని విజయసాయిరెడ్డికి జగన్ చెప్పినట్లు పార్టీలో వార్తలు వస్తున్నాయి.
కేవలం ఎన్నికల వరకు ఉత్తరాంధ్రకు సంబంధించి పార్టీ వ్యవహారాలను చూసుకో అన్న అందుకే ఇన్ చార్జ్ గా బాధ్యతలు ఇచ్చానని షాక్ ఇచ్చారట. మిగతావి ఫలితాలు వచ్చాక మాట్లాడుకుందాం అని జగన్ అనేసినట్లు సమాచారం. దీంతో విజయసాయిరెడ్డి విశాఖపట్టణంలో మేయర్ పీఠం ఏకగ్రీవం కావాలని గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు స్టార్ట్ చేయడం జరిగినట్లు సమాచారం.