పాకిస్తాన్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో పెట్టుకున్న పాకిస్తాన్ ను ప్రపంచ మ్యాప్ నుంచి లేపేయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేసారు. కుత్బుల్లాపూర్ సూరారంలోని మల్లారెడ్డి విద్యాపీట్ లో ఆపరేషన్ సిందూర్ లో దేశ సైనికులకు సంఘీభావంగా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ తో ఇప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం.. ఉగ్రవాదులను వాళ్లు పోషిస్తున్నారన్నారు.
మోడీ జీ పాకిస్తాన్ ని మ్యాప్ లేకుండా చేయండి అంటూ కోరారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తి నాశనం చేయండి అని డిమాండ్ చేసారు. ఇలాంటి ఉద్రిక్తతల టైమ్ లో దేశం కోసం ఎలాంటి త్యాగానికి అయినా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. సరిహద్దులో పోరాటం చేయకపోవచ్చు. కానీ సైనికుల కోసం రక్తదానానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు మల్లారెడ్డి.