కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కావల్సినన్ని మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు లేవన్న సంగతి తెలిసిందే. ఇక మన దేశంలో వీటికి ప్రస్తుతం డిమాండ్ బాగా ఉంది. దీంతో వీటి ధరలను అమాంతం పెంచి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మాస్కుల షార్టేజ్ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. అక్కడి జైళ్లలో ఉన్న ఖైదీలకు మాస్క్‌లను కుట్టే పని అప్పగించింది. దీంతో అక్కడి ఖైదీలు ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమయ్యారు.
కేరళలోనే కాదు.. దేశవ్యాప్తంగా కరోనా మాస్కులకు కొరత ఉండడంతో కేరళ సీఎం పినరయ్ విజయన్ ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అక్కడి జైళ్లలోని ఖైదీలతో మాస్కులను కుట్టించాలని అనుకున్నారు. వెంటనే ఆ పని మొదలు పెట్టేశారు. అంతకు ముందు వరకు ఖైదీలు జైళ్లలో దుస్తులు కుట్టే పని చేసేవారు. అయితే కరోనా మాస్కుల కొరత ఉన్న నేపథ్యంలో వారు ఇప్పుడు దుస్తులు కుట్టడం ఆపి, మాస్కులను కుట్టి అందజేస్తున్నారు. ఈ క్రమంలో కేరళ మొదటగా ఆ మాస్కులను కన్నూర్, వియ్యూర్, తిరువనంతపురం సెంట్రల్ ఏరియాల్లో సరఫరా చేయనున్నారు. ఆ తరువాత మిగిలిన వాటిని దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
#COVID19 | Solving The Mask Problem ?
In light of the shortage, directions were given to engage the prisons in the State in manufacturing masks. It has commenced on a war footing basis. Today, the Prison officials of Thiruvananthapuram Jail have handed over the first batch. pic.twitter.com/QKgHWqYNOg
— Pinarayi Vijayan (@vijayanpinarayi) March 14, 2020
కాగా కేరళలో ఇప్పటి వరకు మొత్తం 22 మందికి కరోనా సోకగా మొత్తం 5468 మందిని పరిశీలనలో ఉంచారు. ఇక తాజాగా మరో 69 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో వారిని హాస్పిటల్లో ఉంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.