సెంట్రల్ జైల్లో రవితేజ…

-

అవున్ మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నారా..రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమా షూటింగ్ ఇప్పుడు అక్కడే జరుగుతోంది..గోపీచంద్ మలినేని దర్శకత్వలో మూడో సారి రవితేజ నటిస్తున్న క్రాక్ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలను రాజమండ్రి సెంట్రల్ జైల్లో నే చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే సగం సినిమా షూటింగ్ పూర్తయింది.

రీసెంట్ గా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు గోపిచంద్ మలినేని
తెలిపారు…

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గతంలో రవితేజ డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నాడు. రవితేజ పక్కన హీరోయిన్ గా శృతిహాస‌న్ నటిస్తోంది. మరో పవర్ ఫుల్ కీ రోల్ లో తమిళ నటి వరల‌క్ష్మీ నటిస్తోంది.ఇప్పటికే రెండు హిట్స్ కొట్టిన ఈ కాంబో తమ కాంబినేషన్ ని మళ్లీ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news