కోపంగా చూస్తున్న వకీల్ సాబ్!

-

వకీల్ సాబ్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. పవర్ స్టార్ రీ ఎంట్రీ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దీనికి తగ్గట్టే కథలో భారీ మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌ను ఓ రేంజ్‌లో చూపించేందుకు సిద్దమైనట్టు కనిపిస్తోంది.
పింక్, నేర్కొండ పార్వైలో ఫస్ట్  లుక్ అయినా పోస్టర్‌లో అయినా అన్యాయానికి గురైన నలుగురు అమ్మాయిలు కనిపిస్తారు. కానీ వకీల్ సాబ్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. అక్కడే అర్థమైపోతోంది కథను ఏ రేంజ్‌లో మార్చేశారో. ఈ రీమేక్ పవన్ చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మగువా మగువా అనే పాట అందర్నీ ఆకట్టుకుంది.
పాట రాసిన రామ జోగయ్య శాస్త్రిని, పాడిని సిద్ శ్రీరామ్‌ను, సంగీతం అందించిన తమన్‌‌ను సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ స్టిల్‌ను తమన్ పోస్ట్ చేశాడు. చురకత్తిలాంటి చూపులతో వకీలీ సాబ్ కోపంగా చూస్తున్నాడు.  ఆ స్టిల్ చూస్తుంటే ఎవరికో మూడినట్టే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news