మన శరీరం పై ఉండే పుట్టుమచ్చలు ఆధారంగా ఎన్నో విషయాలను చెప్పవచ్చు. ముఖ్యంగా, పుట్టుమచ్చల ద్వారా మనిషి ప్రవర్తన, భవిష్యత్తు, అదృష్టం, భావాలు వంటి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. పుట్టుమచ్చలు ముఖం పై ఈ ప్రదేశాలలో ఉంటే, వారు ఎంతో అదృష్టవంతులు అనే చెప్పవచ్చు. సహజంగా చాలా మందికి అనేక చోట్ల పుట్టుమచ్చలు ఉంటాయి. అయితే, ముఖంపై ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే వీరు ఎంతో అదృష్టవంతులు అని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. పైగా ముఖం పై పుట్టుమచ్చలు అందరిని మరింత ఆకర్షిస్తాయి మరియు అదృష్టాన్ని పెంచుతాయి.
ఎవరికైతే నుదుటి పై పుట్టుమచ్చ ఉంటుందో, వారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం, నుదుటి పై పుట్టుమచ్చ ఉన్నవారు చాలా ప్రత్యేకమైన వారు. వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. పైగా, నుదుటి పై పుట్టుమచ్చ ఉన్నవారు ఎంతో కష్టపడి పని చేస్తారు మరియు మంచి గుర్తింపును పొందుతారు. మరికొందరికి పెదవులపై పుట్టుమచ్చ ఉంటుంది. వారు ఎంతో అందంగా ఉంటారు మరియు బాగా మాట్లాడతారు. ముఖ్యంగా, మంచి లక్షణాలు ఉండటం వల్ల భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు మరియు ఎంతో ఆనందంగా జీవిస్తారు.
పెదవుల పై పుట్టుమచ్చ ఉన్నవారి మాటలు ఎంతో మధురంగా ఉంటాయి. పైగా, వీరు కుటుంబంలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు. సమాజంలో కూడా గౌరవం, మర్యాద కలిగి ఉంటారు. కొంతమందికి బుగ్గల పై పుట్టుమచ్చలు ఉంటాయి. బుగ్గలపై పుట్టుమచ్చ ఉన్నవారు, ఇతరులతో పోల్చితే విభిన్నంగా ఉంటారు. వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. భాగస్వామితో కలిసి ఆనందంగా జీవిస్తారు. వీరిలో క్రియేటివిటీ అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. కొంతమందికి ముక్కుపై పుట్టుమచ్చ ఉంటుంది. వారు ఎంతో అదృష్టవంతులు. వీరు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు మరియు ఎలాంటి రంగంలో ఉన్నా సరే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు.