ఈ అసాధారణమైన లక్షణాలను ఎదుర్కొంటున్నారా? ఇవే కిడ్నీ సమస్యలకు సంకేతాలు..!

-

ఆరోగ్యం పై శ్రద్ధ వహించకపోతే, శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కనుక, ఎటువంటి లక్షణాలు కనిపించినా అస్సలు అజాగ్రత్త చేయకుండా, డాక్టర్ ను సంప్రదించి సరైన చర్యలను తీసుకోవాలి. ఎప్పుడైతే లక్షణాలను సాధారణంగా తీసుకుంటారో, దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరియు తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కిడ్నీలు పనితీరు దెబ్బతింటే, శరీరంలో కొన్ని లక్షణాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అటువంటి లక్షణాలను ఎదుర్కొన్నప్పుడు, సకాలంలో డాక్టర్ ను కచ్చితంగా సంప్రదించాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు చర్మం పొడిగా మారడం, కాళ్లలో దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి కారణం, రక్తంలో వ్యర్థ పదార్థాలు, యూరియా వంటివి పేరుకుపోవడమే. దీంతో కాళ్లు, వీపు భాగాల్లో దురద ఏర్పడుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యలకు మెడికేషన్ ను తీసుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక, కిడ్నీలకు సంబంధించిన మెడికేషన్ ను తీసుకోవాలి. ఎప్పుడైతే కిడ్నీలు దెబ్బతింటాయో, ఎలాంటి గాయాలు లేకుండానే పాదాలు లేదా కాలివేలు రంగు మారిపోవడం వంటివి ఎదురవుతాయి. అంతేకాకుండా రక్తనాళాలను ప్రభావితం చేస్తాయి. దీంతో శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగదు.

కిడ్నీ సమస్యలు ఎదురైనప్పుడు రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడంతో పాటు, శరీరంలో ద్రవాల అసమతుల్యత మరియు నరాల దెబ్బ తినడం వంటివి జరుగుతుంది. అలాంటి సమయంలో రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా కాళ్లు పట్టేయడం, పిక్కలు లేదా కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అటువంటి లక్షణాలు కూడా కిడ్నీ సమస్యలకు సంకేతం. కనుక, ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటే అజాగ్రత్త చేయకూడదు అని నిపుణులు చెబుతున్నారు. సకాలంలో సరైన వైద్యం తీసుకోవడం వలన, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మరియు వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news