బిగ్ బ్రేకింగ్: పరిటాల శ్రీరామ్ అరస్ట్ ?

-

తెలుగుదేశం పార్టీలో కీలక కుటుంబం పరిటాల కుటుంబం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరిటాల కుటుంబానికి చెందిన పరిటాల శ్రీరామ్ గతంలో  అనంతపురం జిల్లాలో చెలరేగిపోయారు. చాలావరకు శ్రీరామ్ ఆధ్వర్యంలో దౌర్జన్యాలు మరియు సెటిల్మెంట్లు భౌతిక దాడులు అదేవిధంగా భూకబ్జాలు జరిగినట్లు గతంలో అనేక ఆరోపణలు రావడం జరిగాయి. ప్రస్తుతం అధికారంలోకి లేకపోయినా గాని పరిటాల శ్రీరామ్ ఏమాత్రం రాప్తాడు నియోజకవర్గంలో ఇష్టానుసారంగా వ్యవహరించటం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. Image result for paritala sri ram arrestమేటర్ లోకి వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు వేస్తున్న టైంలో రామగిరి లో ఏకంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో చొక్కా కాలర్ పట్టుకుని పరిటాల శ్రీరామ్ బెదిరించారు. సరిగ్గా అదే సమయంలో తన అనుచరులతో మాట్లాడుతున్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

 

కచ్చితంగా టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ విగ్రహాలను కూలుస్తామంటూ శ్రీరామ్ తీవ్ర వ్యాఖ‌్యలు చేశారు. అయితే ఈ తతంగం మొత్తం వీడియో రూపంలో సోషల్ మీడియాలో రిలీజ్ అయి వైరల్ గా మారింది. దీంతో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కార్యకర్తలను రెచ్చగొట్టిన టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు చేసినట్టుగా రామగిరి పోలీసులు తెలిపారు. వీడియో మొత్తం ఆధారంగా ఉండటంతో ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news