పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసిన హీరోయిన్ దిల్ రాజుకి ఇలా ఉపయోగపడిందా …?

-

అసలే గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పరిస్థితి ఘోరంగా తయారైంది. ఒక సినిమా కి డబ్బులొస్తే వెనకాలే రెండు సినిమాలతో దెబ్బ పడుతుంది. వచ్చిన లాభాలకి రెండింతలు మళ్ళీ లాస్ అవుతు లబో దిబో మంటు బాధపడుతున్నాడు. అయినా పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు కి ఎప్పటి నుంచో సినిమా చేయాలన్న కల ని నెరవేర్చుకోవడానికి బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన పింక్ సినిమాని పవర్ స్టార్ తో వకీల్ సాబ్’ గా రీమేక్ చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మన నేటివిటీ.. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజికి తగ్గట్టు చాలానే మార్పుచేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ పాత్రకు హీరోయిన్ ను కూడా సెట్ చేశారు.

 

అయితే కొన్ని రోజుల నుండి పవన్ సరసన నటించే హీరోయిన్ విషయంలో నిర్మాత దిల్ రాజు చాలానే తర్జన బర్జనలు పడ్డాడు. కియారా అద్వాని అని, శృతి హాసన్ అని, రకుల్ ప్రీత్ సింగ్ అని …ఇలా రక రకాల పేర్లు తెరమీదకొచ్చాయి. ఒకవేళ కియారా ని గనక తీసుకుంటే భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉండేది. ఎందుకంటే ఈ అమ్మడు బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇక రకుల్ ని తీసుకుంటే సినిమాకి మైనస్ అవుతుందని వద్దనుకున్నారట. అయితే వీళ్ళందరిని కాదని చివరికి అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫాం లో లేని లావణ్య గత ఏడాది రిలీజ్ అయిన ‘అర్జున్ సురవరం’ హిట్టు తప్ప తన ఖాతాలో మరే సినిమా పడ లేదు.

దాంతో ఈ సినిమా దిల్ రాజు బ్యానర్, అందులోను పవన్ కళ్యాణ్ సరసన కాబట్టి ఇది లావణ్య త్రిపాఠికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఒకవేళ పవన్ ఎవరైనా టాప్ హీరోయిన్ ను ఫైనలైజ్ చేస్తే వాళ్ళకి రెమ్యూనరేషన్ భారీగా ఇవ్వాల్సి ఉండేది. అయితే పవన్ వాళ్ళని పక్కన పెట్టి లావణ్యకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దిల్ రాజుకి చాలా మేలు చేసినట్టు అయిపోయింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ దిల్ రాజు కి చాలా డబ్బు సేవ్ చేశారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం లావణ్య సినిమాలు లేక ఖాళీగా ఉంది కాబట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే ఛాన్సే లేదు.

Read more RELATED
Recommended to you

Latest news