మినీ జీన్స్ పాకెట్ వెనుక కారణాలు ఇవే..!

-

అన్ని రకాల వయస్సు వారు జీన్ ప్యాంట్ లను వేసుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా ఇవి సింపుల్ మరియు స్టైలిష్ లుక్ ను ఇస్తాయి. పైగా చాలా శాతం మంది యువత ప్రతిరోజు జీన్స్ ను వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే జీన్స్ ప్యాంటుకు పాకెట్లతో పాటుగా మినీ పాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పెద్ద జేబు లోపల ఉండే ఈ చిన్న జేబు అన్ని జీన్స్ ప్యాంట్లకు ఉంటుంది. అయితే దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. సహజంగా ఫ్యాషన్ విషయంలో ఎన్నో ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే జీన్స్ ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. పైగా ట్రెండ్ మారినా సరే, జీన్స్ ప్యాంట్ ను అందరూ ఇష్టపడుతూ ఉంటారు.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, 19వ శతాబ్దం నుండే జీన్స్ ప్యాంట్ లను ధరించడం ప్రారంభమైంది. అయితే శ్రామిక తరగతికి చెందిన ప్రజలు మాత్రమే అప్పుడు జీన్స్ ను ఉపయోగించారు. తర్వాత జీన్స్ ప్యాంటుకు మినీ జేబును కూడా ఇవ్వడం ప్రారంభమైంది. ఆ కాలంలో సమయాన్ని చూసుకోవడానికి వ్రిస్ట్ వాచీలు ఉండేవి కాదు. అందువలన వాచీలను పాకెట్ లో ఉంచేవారు. జీన్స్ లో ఉండే మినీ పాకెట్ ను వాచ్ పాకెట్ అని కూడా పిలుస్తారు. ఎప్పుడైతే కార్మికులు పెద్ద జేబులో గడియారాన్ని పెట్టుకుంటారో, విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కింద పడిపోకుండా వాచ్ కరెక్ట్ గా, సరైన విధంగా వాచ్ ను జేబులో పెట్టుకోవడానికి మినీ పాకెట్ లో పెట్టుకునేవారు.

అయితే ఇప్పుడు ఈ మినీ పాకెట్ ను వాచ్ పెట్టుకోవడానికి ఉపయోగించకుండా, చిన్న వస్తువులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. తాళం చెవి, కాయిన్స్ వంటివి ఈ మినీ పాకెట్ లో పెట్టుకుంటున్నారు. దీనిని ఇది వరకు వాచ్ పాకెట్ అని పిలవగా, ప్రస్తుతం కాయిన్ పాకెట్, టికెట్ పాకెట్ అని ఎన్నో రకాల పేర్లతో పిలుస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికీ కూడా మినీ జీన్స్ పాకెట్ అన్ని జీన్స్ ప్యాంట్ లోను తప్పకుండా ఉంటుంది. పైగా కొన్ని రకాల జీన్స్ ప్యాంట్ మోడల్స్ లో మినీ పాకెట్ సైజును కూడా పెంచడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news