జనాలు కరోనాతో భయపడుతుంటే, కనపడని ఎమ్మెల్యేలు…!

-

ఒక పక్క దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. అన్ని విధాలుగా కరోనా వైరస్ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా వైరస్ మాత్ర౦ కట్టడి కావడం లేదు. ఏ జాగ్రత్తలు తీసుకున్నా సరే ప్రజలు మాత్రం కరోనా వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

అయితే మధ్యప్రదేశ్ లో మాత్రం ఎమ్మెల్యేలకు ప్రజల ఆరోగ్యం ఏ మాత్రం పట్టడం లేదు. క్యాంపు రాజకీయాలు చేస్తూ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారం డ్రామా ఆడుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో నాయకులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటే మధ్యప్రదేశ్ లో మాత్రం అధికార విపక్షాలు కరోనా వైరస్ ని లైట్ తీసుకుని, అధికారం కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

ప్రజల ఆరోగ్యాన్ని అక్కడి పాలకులు గాలికి వదిలేసారు. పరిస్థితి తీవ్రత అక్కడ పాలకులకు అర్ధం కావడం లేదు. ప్రస్తుతం 150 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అయినా సరే ప్రజలను పట్టించుకోవడం లేదు. బలపరీక్ష కోసం రాజకీయాలు చేస్తున్నారు. క్యాంపుల్లో ఉండి రాజకీయాలు నడిపిస్తున్నారు గాని తమకు ఓటు వేసిన ప్రజలను మాత్రం ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news