వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది. సత్తెనపల్లిలో వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయ్యింది. జగన్ పర్యటనలో పోలీసులతో వాగ్వాదానికి దిగి వాళ్ల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై కేసు నమోదు అయ్యింది. 188, 332, 353, 427 సెక్షన్ల కింద సత్తెనపల్లిలో వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయ్యింది.

కాగా నిన్న వైసీపీ మాజీ మంత్రి అంబటితో పోలీసుల వాగ్వాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా సరిహద్దులో బ్యారికేడ్లు అడ్డుపెట్టారు పోలీసులు. వైసీపీ వాహనాలను, కార్యకర్తలను అడ్డుకుంటున్నారు పోలీసులు. బ్యారికేడ్లను తొలగించాలని కోరారు అంబటి రాంబాబు.
అందుకు అంగీకరించకపోవటంతో స్వయంగా బ్యారికేడ్లను పక్కకు నెట్టేసిన అంబటిపై కేసు నమోదు అయ్యింది.