హైదరాబాద్‌లో మద్యం మత్తులో పోకిరీల హంగామా

-

హైదరాబాద్‌లో మద్యం మత్తులో పోకిరీలు హంగామా సృష్టించారు. ఉప్పల్ X రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి మద్యం మత్తులో కారును వెంబడించి దాడికి దిగారు యువకులు. ఉప్పల్ X రోడ్డు వద్ద వాహనాలతో రోడ్డు బ్లాక్ కావడంతో హరన్ కొట్టాడు ఓ క్యాబ్ డ్రైవర్. దీంతో క్యాబ్ డ్రైవర్‌పై గొడవకు దిగారు యువకులు.

Drunk hooligans cause chaos in Hyderabad
Drunk hooligans cause chaos in Hyderabad

కారు డోర్ తెరిచి, లోపల కూర్చున్న ఐటీ ఉద్యోగులపై దాడి చేసాడు యువకుడు. అంతటితో ఆగకుండా స్కూటీపై కారును వెంబడించి భయబ్రాంతులకు గురిచేశారు ఆకతాయిలు. యువకులు వెంబడించడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఐటీ ఉద్యోగులు. ఇక ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చిన సమయంలో దాడి చేసేందుకు పోలీస్ స్టేషన్ బయట నిలబడి, పోలీసులు రావడం చూసి పారిపోయారు యువకులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news