స్మశానంలో ఎవరు ఉండకూడదు అనే మాట మనం వింటూ ఉంటాం దానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా.. శాస్త్ర ప్రకారం గతంలో స్త్రీలు కూడా స్మశానంలోకి వచ్చేవారు కాలక్రమేనా, వచ్చిన మార్పుల వల్ల స్త్రీలను స్మశానానికి నిషేధించారు. చిన్న వయసు ఉన్న పిల్లలను కూడా, స్మశానం లోనికి రానివ్వకుండా భయపడతారన్న ఉద్దేశంతో నిషేధించారు.
సాధారణంగా స్మశాన వాటికలో మరణించిన వ్యక్తి యొక్క కుమారులు,దగ్గర బంధువులు స్నేహితులు మాత్రమే ఉంటారు. ఇక అక్కడ బాధపడుతూ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని, అది శారీరకంగా మానసికంగా క్షోభ ను కలిగిస్తుందని అక్కడ ఎవరిని ఉండదు అని అంటారు.
ఇక పరిసరాల పరిశుభ్రత కూడా తక్కువగా ఉంటుంది స్మశాన వాటికలో కుళ్ళిపోతున్న శవాల నుంచి వచ్చే వాసన వ్యాధులకుకు కారణం అవుతుంది అందుకే అక్కడ ఎక్కువసేపు ఉండకుండా బయటికి వచ్చేయమని అంటారు.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు స్మశానానికి వెళ్లకూడదని, అక్కడ ఉండే ప్రతికూల వాతావరణం, ఆధ్యాత్మిక ప్రభావాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి గర్భంలోని శిశువు పైన తల్లి పైన ప్రతికూల ప్రభావం చూపుతుందని గర్భిణీ స్త్రీలు స్మశానానికి వెళ్ళకూడదని అంటారు.
ఇక సన్యాసం తీసుకున్న వారు వారి ఆశ్రమ ధర్మం ప్రకారం అగ్ని వారి దేహంలోనే ఉంటుందని భావించడం వలన, వారు స్మశానానికి దూరంగా ఉంటారు. వారిని కేవలం ఖననం మాత్రమే చేస్తారు.
మరణించిన వ్యక్తి, దహనం తర్వాత అక్కడ ఉండకుండా రావడానికి మరో కారణం మతపరమైన నమ్మకాలు, ఒక్కో సాంప్రదాయంలో ఒక్కో విధంగా దహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో చనిపోయిన వ్యక్తి యొక్క కుమారులు దహనం చేసిన తరువాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
స్మశానం అంటేనే మరణంతో సంబంధం ఉన్న ప్రదేశం అని అక్కడ ప్రతికూల వాతావరణం ఉంటుందని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. శారీరకంగా మానసికమైన శ్రేయస్సు కోసం స్మశానానికి దూరంగా ఉండమని చెబుతారు. కొన్ని సాంప్రదాయ ఆచారాలు నియమాలు ఇప్పటికీ పాటిస్తున్నారు.