Kingdom Review: కింగ్‏డమ్ రివ్యూ.. విజయ్ దేవరకొండ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

-

 

Kingdom Review:  రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన ఈ సినిమాపై తన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలకు తగినట్టుగానే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

kingdom movie review
kingdom movie review

కథ మరియు వివరణ:
అన్నను వెతుక్కుంటూ వెళ్లిన హీరో విజయ్ దేవరకొండ ఓ తెగకు రాజు ఎలా అవుతాడు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాక్షన్ అద్భుతంగా ఉందని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ విలనిజం, అనిరుద్ బిజిఎం అదిరిపోయాయి. కాగా, ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషన్ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అయ్యారు. సెకండ్ హాఫ్ లో కాస్త స్లో నరేషన్, కథలో కాస్త బోరింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో పాటలు లేకపోవడంతో సినిమా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. పార్ట్ 2 కోసం సినిమాను మధ్యలోనే ఆపేసినట్లుగా తెలుస్తోంది డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత మేరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలని చిత్త యూనిట్ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news