దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. తాజాగా ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐసీసీ లీగల్ సెల్ సదస్సులో మాట్లాడారు రాహుల్ గాంధీ. కొన్ని రాష్ట్రాల్లో మాకు ఒక్క సీటు రాకపోవడం ఏంటి..? బీజేపీకి అన్ని స్థానాలు రావడం ఏంటి.? అని షాక్ అయినట్టు వెల్లడించారు. కేవలం 15 సీట్లతోనే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతామన్నారు. లోక్ సభ ఎన్నికలు రిగ్ అయ్యాయి. ఆ 15 సీట్లు లేకుంటే మోడీ కి ప్రధానీ పదవీ దక్కేది కాదన్నారు. రఫెల్ డీల్ తో పీఎంవో తో పాటు NSA జోక్యం చేసుకున్నాయని.. రాబోయే రోజుల్లో ఇవన్ని బయటపెడతామన్నారు. దీనికి సంబంధించి మాకు డాక్యుమెంట్ దొరికింది అన్నారు.
బీజేపీకి అధిక ఓట్లు పడటం పై ఫోకస్ చేశామని తెలిపారు. బీజేపీ ఓట్లు చూసి తాను షాక్ అయ్యానని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. కానీ అందులో ఫేక్ ఓట్లు ఉన్నట్టు తమకు సమాచారం వచ్చిందని.. మా దగ్గర 100 శాతం ఆధారాలున్నాయని తెలిపారు. ప్రతీ 6.5 లక్షల మంది ఓటర్లలో 1.5 లక్షల ఓట్లు ఫేక్ అని తేలింది అన్నారు.