రేవంత్, పొంగులేటి ఇళ్లు చెరువులోనే ఉన్నాయి : కేటీఆర్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి హైడ్రా (HYDRAA)పై విరుచుకు పడ్డారు. హైదరాబాద్ లో నీటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పుకునే హైడ్రా అధికారులు కళ్ళకు కాంగ్రెస్ నేతల ఇళ్ళు చెరువుల్లోనే కట్టుకున్నవి ఎందుకు కనిపించడం లేదంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేవీపీ ఇళ్ళు చెరువుల్లోనే కట్టినా హైడ్రా కళ్ళు మూసుకుని ఉంటోందని ఆరోపించారు.

cm revanth Reddy
హైడ్రా కు పేదల ఇళ్ళు మాత్రమే కనిపిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. గత పదేళ్లలో ప్రాంతీయ విద్వేషాలు, మత విద్వేషాలు లేకుండా చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే మళ్లీ రాష్ట్రంలో విద్వేషాలు పుడుతున్నాయని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ స్థానంలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని.. ఈసారి కూడా కాంగ్రెస్ కు హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా రాదని  జోస్యం చెప్పారు కేటీఆర్. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి.. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news