హైదరాబాద్ నగరవాసులకు రెడ్ అలర్ట్. ఆఫీసుకు వెళ్లిన వాళ్లు వెంటనే ఇండ్లకు చేరుకోవాలని… హైదరాబాద్ నగర ఉద్యోగులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల్లోపు ఇండ్లకు చేరుకోవాలని హెచ్చరించింది.

సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం హైదరాబాదులో కురుస్తుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక సాయంత్రం షిఫ్ట్ ఉన్నవాళ్లు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని.. వాతావరణ శాఖ సూచనలు చేసింది. అత్యవసరం అయితే తప్పితే బయటకు రాకూడదని వారిని కూడా ఇచ్చింది. ఇవాళ సాయంత్రం హైదరాబాదులో కుండపోత వర్షం గ్యారెంటీ అని వెల్లడించింది.