నీట్ లో ర్యాంకు సాధించి మెడికల్ సీటు కోల్పోతానని ఆందోళనలో ఉన్న దివ్యాంగ విద్యార్థికి మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. తిరుపతికి చెందిన దాసారెడ్డి బ్రహ్మ రెడ్డికి 1,174 ర్యాంక్ రాగా…. ఇంటర్ మెమోలో ఇంగ్లీష్ ఎగ్జెంప్టెడ్ అని ఉంది. దీంతో ఆ వ్యక్తి సీటు రాదని తెలిసి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. దీంతో నారా లోకేష్ వెంటనే స్పందించి ఆయన గతంలో జారీ చేసిన స్పెషల్ GOతో ఆ వ్యక్తికి ఇంగ్లీష్ లో 35 మార్కులతో కలిపి మెమో ఇవ్వడంతో సీటు వచ్చింది.

దీంతో ఆ విద్యార్థి మంత్రి నారా లోకేష్ కు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగ విద్యార్థికి నీట్ సీటు వచ్చేలా చేయడంతో తన కుటుంబ సభ్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచితంగా బస్సు సదుపాయాన్ని ఈరోజు నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ పథకాన్ని మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దీంతో ఏపీలోని మహిళలు చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.