తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఒక్కో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడి.. పరిస్థితులు ఆస్తవ్యస్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల పాఠశాలలకు హాలిడే ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ అలాగే సిద్దిపేట జిల్లాలో ఇవాళ హాలిడే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డి పరిధిలోని మడ్నురు అలాగే డోంగ్లి మండలాలకు సెలవు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం జిల్లాలోని పాఠశాలలకు హాలిడే ఇవ్వడం జరిగింది.
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు దాడి చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అవసరమైతే పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు… ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు నడుచుకుంటున్నారు.