అమానుషం.. కొడుకును చంపేసి మూట కట్టి మూసీలో పడేశాడు ఓ తండ్రి. హైదరాబాద్ పాతబస్తీ-బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కొడుకుని హత్య చేశాడు తండ్రి మహమ్మద్ అక్బర్. అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయా పుల్ బ్రిడ్జి పైనుంచి మూసీలో పడేశాడు తండ్రి.

ఆపై ఏమీ తెలియదన్నట్లు బాబు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఇక అనుమానంతో తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. నిజం ఒప్పుకున్నాడు తండ్రి మహమ్మద్ అక్బర్. బాలుడి మృతదేహం కోసం బండ్లగూడ పోలీసులు, హైడ్రా, NDRF సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.