చాలామందికి తెలియకుండానే ఉన్న ఒక సర్వసాధారణమైన అలవాటు ముక్కులో పిచ్చుక (పక్కు లేదా డ్రైడ్ మ్యూకస్) తినడం. ఇది కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా హానికరం. బయట ధూళి, కాలుష్యం క్రిములను వడపోసే ముక్కులో ఉండే పక్కును తినడం వల్ల శరీరంలోకి క్రిములు సులభంగా ప్రవేశిస్తాయి. దీనిని వైద్య పరిభాషలో రైనోటిల్లెక్సోమానియా అని పిలుస్తారు. మరి ఈ అలవాటు వల్ల కలిగే నష్టాలు, ఇది ఎందుకు వస్తుంది వంటి విషయాలు తెలుసుకుందాం.
ఈ అలవాటు వల్ల కలిగే నష్టాలు: ముక్కులో ఉండే పక్కులో ధూళి, కాలుష్యం క్రిములు, బ్యాక్టీరియా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆ క్రిములు నేరుగా శరీరంలోకి వెళ్లి అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు.
ముక్కుకు గాయాలు: వేలితో ముక్కును తరచుగా తవ్వడం వల్ల లోపలి భాగం సున్నితంగా మారి గాయాలు లేదా చిన్న చిన్న రక్తస్రావాలు జరగవచ్చు. ఈ గాయాల ద్వారా కూడా క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
ఇన్ఫెక్షన్లు: ముక్కులోపల ఏర్పడే గీతలు, గాయాలు బ్యాక్టీరియాకు సులభంగా ప్రవేశ మార్గాన్ని కల్పిస్తాయి. దీనివల్ల ముక్కులో ఇన్ఫెక్షన్లు, వాపు వంటివి రావొచ్చు.

అంగీకరించలేని అలవాటు: ఇది ఒక రకమైన చెడు అలవాటు. దీనిని ఇతరుల ముందు చేయడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రత మనకు లేదని భావిస్తారు. అసలు ముక్కులో పక్కు తినే అలవాటు ఎలాంటి వాళ్లలో ఉంటుంది అనేది తెలుసుకుంటే ..
ఒత్తిడి లేదా ఆందోళన: ఒత్తిడి, ఆందోళన లేదా నిద్రలేమి ఉన్నప్పుడు కొంతమంది తెలియకుండానే ఈ అలవాటుకు లోనవుతారు. ఇది వారి ఆందోళనను తాత్కాలికంగా తగ్గించుకోవడానికి చేసే ఒక ప్రయత్నం.
మానసిక సమస్యలు: అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) వంటి కొన్ని మానసిక సమస్యలు ఉన్నవారిలో ఈ అలవాటు ఎక్కువగా కనిపించవచ్చు.
కేవలం అలవాటుగా: చిన్నప్పుడు మొదలైన ఈ అలవాటు పెద్దయ్యాక కూడా కొనసాగవచ్చు. ఇది ఒక నిర్దిష్ట సమయం లేదా పరిస్థితిలో ఎక్కువగా కనిపించవచ్చు. ఉదాహరణకు, టీవీ చూస్తున్నప్పుడు లేదా ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు. ఇక పెద్దల్లో కాక ఈ అలవాటు పిల్లలకు ఉంటుంది. చిన్నపిల్లలు తమ శరీర భాగాలను తరచుగా తాకుతూ ఉంటారు. అందులో భాగంగా ముక్కులో వేలు పెట్టుకోవడం సహజం తల్లిదండ్రులు దీన్ని గమనించి, ఆ అలవాటును మాన్పించాలి.
ఈ అలవాటును మానుకోవాలంటే, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, ప్రత్యామ్నాయంగా ముక్కును టిష్యూతో శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలి. అలవాటు తీవ్రంగా ఉన్నట్లయితే వైద్యుడిని లేదా మానసిక నిపుణుడిని సంప్రదించడం మంచిది.