పురుషుల కంటే.. స్త్రీలకే నిద్ర ఎక్కువ అవసరం అంటున్న అధ్యయనాలు..

-

నిద్ర మనుషులకు చాలా అవసరం.. అందులోనూ మగవారితో పోలిస్తే.. ఆడవారికే.. నిద్ర ఎక్కువ అవసరం అంటున్నారు.. శాస్త్రవేత్తలు. మహిళలకు ఎంత నిద్ర అవసరమో తెలుసుకుందాం. స్త్రీల మెదళ్ళు వారి దినచర్య నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. నిద్రలేమి ఉన్న స్త్రీలు డిప్రెషన్ కోపానికి గురవుతారు. ఇది మాత్రమే కాదు విశ్రాంతి విషయంలో పురుషుల కంటే మహిళలకు ఎక్కువ విశ్రాంతి అవసరం. దీని వెనుక బలమైన కారణం ఉంది.

రోజంతా పని

పెళ్లయి, పిల్లలు ఉన్న ఆడవాళ్లకు ఖాళీ సమయం ఉండదు. చాలా మంది మహిళలు పనికి వెళ్లి ఆ తర్వాత ఇంటి పనులు, పిల్లలను చూసుకుంటారు. కొంత మంది మహిళలు కూలి పనులకు వెళ్లకపోయినా పిల్లలకు ఇంటిపనులే సరిపోతాయి. పిల్లలు రాత్రంతా మేల్కొన్నా తల్లికి సరిగా నిద్ర పట్టదు. ఆమె రోజంతా కష్టపడాలి, విశ్రాంతి తీసుకోలేరు. ఇది ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే సరైన నిద్రపోవాలి.

నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు..

ఈరోజుల్లో చాలామంది.. మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు.. పురుషులు బరువు పెరిగినా సులభంగా తగ్గించుకోవచ్చు. కానీ స్త్రీలకు బరువు తగ్గడం అంటే కాస్త కష్టమైన పనే.. ఊబకాయం ఉన్న స్త్రీలు నిద్రలేమికి ఎక్కువగా గురవుతారు. కాబట్టి నిద్రలేమి, అధిక బరువు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. నిద్రలేమి కారణంగా ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ అధికంగా విడుదలవుతుంది. అధిక కార్టిసాల్ విడుదలతో ఆకలి, ఊబకాయం సమస్యలు వస్తాయి. తగినంత నిద్రపోతే వీటి నుంచి బయటపడొచ్చు.

స్త్రీల హార్మోన్‌ ఛేంజెస్‌..

యుక్తవయస్సు సమయంలో హార్మోన్లు, పీరియడ్స్ మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. పీరియడ్స్ సమయంలో శారీరక అసౌకర్యం, నొప్పి కారణంగా మహిళల మెదడుకు ఎక్కువ నిద్ర అవసరం అవుతుంది. ఇది కాకుండా, మహిళలు ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు. కాబట్టి వారికి నిద్ర ఎక్కువగాఉండాలి.

భర్త, పిల్లలు

స్త్రీలు తమ భర్తలు, పిల్లల గురించి ఆందోళన చెందుతారు. ముందు వాళ్లు తిన్నాకే వీళ్లు తింటారు.. పిల్లలకు సేవ చేస్తుంటారు. అందువల్ల, మహిళలకు విశ్రాంతి అవకాశాలు చాలా తక్కువ. ఈ రొటీన్‌కి అలవాటు పడిన ఆడవాళ్ళకి అవకాశం దొరికితే నిద్ర పట్టదు. ఈ కారణాల వల్ల స్త్రీలకు నిద్ర చాలా అవసరం. తగినంత నిద్ర పొందడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలరు.

Read more RELATED
Recommended to you

Latest news