ఒక సినిమా హిట్టైతే ఆ పెయిర్ చాలా ఫేమస్ అవుతారు. ఇలా చాలా జంటలు ఆన్ స్క్రీన్ ఫేమస్ అయ్యి ఆఫ్ స్క్రీన్ జోడిలుగా అనిపిస్తారు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, రష్మికలు కూడా హాట్ పెయిర్ గా నిలుస్తున్నారు. ఇద్దరు కలిసి చేసిన గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఇద్దరి మీద ఆడియెన్స్ కన్ను పడింది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది రష్మిక.
కన్నడ నుండి వచ్చిన ఈ అమ్మడు తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సినిమాలోనే కాదు రీసెంట్ గా జరిగిన మిర్చి మ్యూజిక్ అవార్డ్ సౌత్-2017 వేడుకలో కూడా ఈ జోడి అలరించింది. విజయ్ తో పాటుగా స్టేజ్ మీదకు వచ్చిన రష్మిక ఈ ఇద్దరిని ఓ స్టెప్ వేయాల్సిందిగా కోరగా ఇద్దరు కలిసి అలా అలా కాలుకదిపారు. గీతా.. గోవిందం.. కలిసి చేసిన ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ రౌడీ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.