ఏలూరు: అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు న్యాయం చేయాలంటూ ఈ నెల 29, 30 తేదీల్లో విజయవాడ ధర్నాచౌక్ వద్ద 30 గంటలపాటు ధర్మాగ్రహ దీక్ష చేయనున్నట్టు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరరావు తెలిపారు. ఆదివారం విజయవాడలో అగ్రిగోల్డ్ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగిందన్నారు. సమా వేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.విశ్వనాథరెడ్డి, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు పాల్గొన్నారు. బాధితుల సమస్యలపై చర్చ జరి గిందన్నారు. అనంతరం సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29, 30 తేదీల్లో ధర్మాగ్రహ దీక్ష చేయాలని నిర్ణయించామన్నారు.
29, 30 తేదీల్లో అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా
-