బాలీవుడ్ నటి మోడల్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె వయసు 51 ఏళ్లు దాటినా, ఆమెలో కనిపించే యవ్వనం, అద్భుతమైన ఫిట్‌నెస్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఆమె అందం, ఫిట్‌నెస్ వెనుక రహస్యం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆమె కేవలం జిమ్ వర్కౌట్స్‌కే పరిమితం కాలేదు, ప్రాచీన చైనీస్ సంస్కృతి లోని కొన్ని రహస్యాలను తన దైనందిన జీవితంలో పాటిస్తుంది. వయసును కేవలం ఒక సంఖ్యగా మార్చిన మలైకా రహస్యమేంటో ఆమె అనుసరించే 7 ప్రత్యేకమైన చైనీస్ బాడీ మూవ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చైనీస్ సంస్కృతిలో ప్రాచుర్యం పొందిన కిగాంగ్, తాయ్ చి (Tai Chi) వంటి ప్రాచీన వ్యాయామ పద్ధతులు మలైకా అరోరా యవ్వన రహస్యాలలో భాగమని చెప్పవచ్చు. ఈ మూవ్స్ శరీరంలో ‘చి’ (Chi) లేదా జీవశక్తి (Life Energy) ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. మలైకా ఫిట్‌నెస్‌కు దోహదపడే 7 చైనీస్ బాడీ మూవ్స్, వాటి లాభాలు మనము తెలుసుకుందాం..
ఆరు హీలింగ్ సౌండ్స్ : శరీరంలోని వివిధ అవయవాలలో (ఉదా: ఊపిరితిత్తులు, కాలేయం) పేరుకుపోయిన ఒత్తిడి వేడిని కొన్ని ప్రత్యేక శబ్దాల ద్వారా బయటకు పంపే పద్ధతి ఇది. ఇది అంతర్గత అవయవాలను రిఫ్రెష్ చేస్తుంది.

ది టైగర్ ఫ్రోలిక్: ఇది ఫైవ్ నిమల్ ఫ్రోలిక్స్ లో ఒక భాగం. పులి కదలికలను అనుకరించే ఈ వ్యాయామం, ఎముకలు మరియు కండరాలను బలోపేతం చేస్తుంది, శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.
ది మంకీ ఫ్రోలిక్: కోతి కదలికలను పోలి ఉండే ఈ మూవ్, మెదడు-శరీర సమన్వయాన్ని (Mind-Body Coordination) మెరుగుపరుస్తుంది. ఇది వయసు పెరిగే కొద్దీ తగ్గే ఏకాగ్రతను, చురుకుదనాన్ని పెంచుతుంది.
ఆర్మ్ సర్కిల్స్: నిలబడి చేతులను నెమ్మదిగా పెద్ద వృత్తాకారంలో తిప్పడం వలన భుజాలు మరియు చేతుల్లోని ఉద్రిక్తత తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
లోయర్ డాన్-టియెన్: చైనీస్ మెడిసిన్ ప్రకారం బొడ్డు కింద ఉన్న ఈ పాయింట్ శక్తి కేంద్రం. ఇక్కడికి శ్వాసను తీసుకునే ఈ పద్ధతి జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు శక్తిని నిల్వ చేస్తుంది.
సింగిల్ విప్, (తాయ్ చి): తాయ్ చిలోని ఈ మూవ్ నిలకడ, బ్యాలెన్స్ మరియు కాళ్ల బలాన్ని పెంచుతుంది. వెన్నెముక ఆరోగ్యం కోసం ఇది చాలా మంచిది.
స్టాండింగ్ మెడిటేషన్: శరీరాన్ని స్థిరంగా రిలాక్స్‌డ్‌గా ఉంచి నిలబడే ఈ భంగిమ, అంతర్గత శక్తిని నిర్మించి, మానసిక ఒత్తిడి ని తగ్గిస్తుంది.
మలైకా అరోరా యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి ఈ చైనీస్ బాడీ మూవ్స్‌ను క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఈ మూవ్స్ కేవలం శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా మానసిక ప్రశాంతతను అందించి శరీరంలో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మీరు కూడా వయసును మించిపోయే యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
గమనిక: ఏదైనా కొత్త వ్యాయామ పద్ధతిని ప్రారంభించే ముందు, ముఖ్యంగా కిగాంగ్ లేదా తాయ్ చి వంటి వాటిని, నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో నేర్చుకోవడం లేదా వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. సరైన పద్ధతిలో చేయడం వలన గరిష్ఠ ప్రయోజనాలు లభిస్తాయి.