తెలంగాణాలో పదో తరగతి పరీక్షలను మళ్ళీ వాయిదా వేసారు. లాక్ డౌన్ నిర్ణయం నేపధ్యంలో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మంగళవారం నుంచి జరగాల్సిన పది పరీక్షలు మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల హైకోర్ట్… ఈనెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు నిర్ణయం వెల్లడించింది.
లాక్డౌన్ నేపధ్యంలో 31 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుంది కాబట్టి అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు బోర్డ్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి మీడియాకు వివరించారు. వచ్చే నెల 20 నుంచి పరిక్షలు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తేదీలు త్వరలో ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి.