ఆ పని చేస్తున్న మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్…!

-

వలస కార్మికుల విషయంలో తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పుడు దేశం మొత్తం హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ పనిని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం ఇతర రాష్ట్రాల వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరుకులను పంపిణి చేస్తుంది. వారు అందరిని గుర్తించిన అధికారులు, వారి వివరాలను నమోదు చేసారు. ఇప్పుడు వారికి రేషన్ సరుకులను ఇస్తున్నారు.

అదే విధంగా వారికి నిత్యావసర సరుకుల కోసం తెలంగాణా ప్రభుత్వం 500 వరకు ఇస్తుంది. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రజలకు ఇబ్బంది రాకుండా 12 కేజీల రేషన్ తో పాటుగా 1500 డబ్బులు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకి రాలేదు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ కూడా ఈ నిర్ణయాలు తీసుకోలేదు. తెలంగాణా అభివృద్దిలో మీరు భాగస్వాములు అంటూ కేసీఆర్ వారిని కొనియాడారు. మీ కడుపులు నింపుతామని ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆయన మీడియా సమావేశంలో వారికి స్పష్టంగా చెప్పారు. దీనితో వలస కార్మికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news