శ్రీశైల మల్లికార్జున స్వామి విశేషాలు ..!

-

ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో శివుడు కొలువై ఉన్నాడు. వాటిలో ఒకటైన శ్రీశైల మల్లిఖార్జున స్వామి ఆలయం.  శ్రీశైల క్షేత్రం ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయం 6 వ శతాబ్దానికి చెందింది గా చరిత్ర చెపుతుంది. ఇక్కడి దేవాలయం భ్రమరాంబా మల్లిఖార్జున స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది గా ఉంటే, అష్టాదశ శక్తీ పీటాలలో ఆరవది. స్థల పురాణం ప్రకారం పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఘోర తపస్సు చేసి రెండు కాళ్ళతో నడిచేవి గాని, నాలుగు కాళ్ళ తో నడిచే వాటితో కాని మరణం రాకుండా వరం పొందాడు.

దీనితో దేవతలందరూ కలిసి ఆది శక్తిని ప్రార్థించగా అతను గాయత్రి మంత్రం జపిస్తున్నంతసేపు అతనిని ఎవరూ ఏమి చేయలేరు అని అంటుంది.మరో సారి దేవతలందరూ కలిసి తమ గురువైన బృహస్పతిని పంపగా అరుణా సురుడు తమరి రాకకు కారణమేమిటి అంటాడు. దానికి బృహస్పతి మనిద్దరం గాయత్రి మంత్రం జపించేవారమే కదా. నా రాక యాదృచ్చికమే అంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు దేవతలు జపించే మంత్రాన్ని తాను జపించాటమేమి అని జపించటం మానేస్తాడు. దానితో కోపగించిన జగన్మాత భ్రమర రూపం దాల్చి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. అందుకే ఈ క్షేత్రానికి భ్రమరాంభా సహిత మల్లిఖార్జున స్వామి దేవాలయం గా పేరు వచ్చింది.

ఈ అలయా నికి రక్షణ కోసం కొంత మంది రాజులు చుట్టూ ప్రహరి గోడ, నాలుగు గోపురాలు నిర్మించారు. . ఇక్కడ మల్లెల తీర్థం లో స్నానం చేస్తే సకల పాపాలు పోయి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం.  ఇక్కడ మరో విశేషం పాతాళ గంగ. అదే నండి కృష్ణా నదిని ఇక్కడ పాతాళ గంగ గా వ్యవహరిస్తారు. శ్రీశైల క్షేత్రం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున ఇక్కడ పాతాళ గంగ లో స్నానం చేయాలంటే ఎన్నో మెట్లు దిగాలి. ఇక్కడ త్రేతాయుగము నాటి ఆంజనేయ స్వామీ దేవాలయం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news