ట్రిపుల్ ఆర్ స్క్రిప్ట్ ఫినిష్

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోతున్న మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ఎనౌన్స్ చేసిన నాటి నుండి సినిమాపై రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ సినిమాకు ట్రిపుల్ ఆర్ అంటూ ఓ క్రేజీ కాన్సెప్ట్ ఆలోచించిన జక్కన్న ఆ సినిమాను అక్టోబర్ లో మొదలుపెట్టాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దాదాపు పూర్తి అయ్యిందట. సినిమా ఈ ఇయర్ లోనే సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఇప్పటికే సినిమాకు కావాల్సిన సెట్టింగ్స్ గురించి డిస్కషన్స్ పూర్తి చేశారట. అంతేకాదు సినిమా కోసం చరణ్, ఎన్.టి.ఆర్ లతో వర్క్ షాప్ కూడా చేయిస్తున్నాడు రాజమౌళి. మొత్తానికి ట్రిపుల్ ఆర్ పై ఓ అప్డేట్ అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news