లాక్ డౌన్ విషయంలో మోడీ వ్యూహం ఏంటీ…?

-

లాక్ డౌన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం ఏంటీ…? ఇప్పుడు దీనిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రాల్లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మోడీ సర్కార్ దీనిని పొడిగిస్తుంది అని అందరూ భావించారు. అయితే ఈ నెల 14 తర్వాత దాన్ని విడతల వారీగా ఎత్తేస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

ఏప్రిల్ 14 వరకు ప్రజలెవరూ ఇల్లు విడిచి బయటకు రావొద్దని, కరోనా అడ్డుకట్టకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఏప్రిల్ 14న లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే ప్రజలంతా మూకుమ్మడిగా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనితో పరిస్థితిని అదుపు చేయడం దాదాపుగా కష్టమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి.

సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ ఈ అంశాన్ని లేవనెత్తారు. లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని, లాక్‌డౌన్‌ను దశల వారీగా ఉపసంహరించాలని సూచించారు. ప్రజలంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా దఫాలుగా వచ్చేట్లు చూడాలని ఆయన ముఖ్యమంత్రులకు సూచించారు. కరోనా వైరస్‌ నియంత్రణకు వచ్చే కొద్ది వారాల్లో వైద్య పరీక్షలు, బాధితుల గుర్తింపు, ఐసొలేషన్‌, క్వారంటైన్‌ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలు దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news