వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై సంచలన ఆరోపణలు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, టెస్టింగ్ ల్యాబ్స్ పెంచడం లేదని, కరోనా కేసులను డీల్ చేసే విధానం, అడ్డుకునే విధానం ఇదా అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తాజాగా ట్విట్టర్ లో రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా? మనిషి జన్మ ఎత్తిన వారెవరూ అలా కోరుకోరు. ఎల్లో మీడియా, చంద్రబాబు, ప్యాకేజీ జీవులు మాత్రం ఇటువంటి శాడిస్టిక్ భ్రమల్లో ఉన్నారు. సిఎం జగన్ గారు వ్యాధిని నియంత్రించడంలో విఫలమయ్యారని నింద వేసేందుకు కాచుక్కూర్చున్నారు. అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు ఆయన.
కృష్ణానదికి వరదొస్తే కరకట్ట కొంప మునుగుతుందేమోనని రాత్రికి రాత్రి చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడని ఆరోపించారు. కరోనా వైరస్ ప్రబలుతుందనగానే పెట్టేబేడా సర్దుకుని ముందే పొరుగు రాష్ట్రం చేరాడని ఎద్దేవా చేశారు. మూడడుగుల దూరం పాటించమంటే మూడొందల కిలోమీటర్లు పారిపోయిన నువ్వు సుద్దులు చెప్పటమేంటీ బాబూ ? కర్మ కాకపోతే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.