పాపం ఆయనకి లక్షన్నర కోట్లు నష్టం ..!

-

కరోనా వైరస్ ఎఫెక్టుతో అంబానీ చాలా తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల ప్రముఖ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా వైరస్ కారణంగా ముకేశ్ అంబానీ దాదాపు లక్షన్నర కోట్లు నష్టపోయినట్లు వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ కూడా కరోనా ఎఫెక్ట్ తో బాగా నష్టపోయినట్లు కూడా తెలిపింది. దీంతో కోవిడ్-19 ప్రభావం భారతదేశంలోని ధనవంతులపై తీవ్రస్థాయిలో ఉన్నట్లు ఆ సంస్థ చెప్పుకొచ్చింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం.. గౌతమ్ అదానీ 5 బిలియన్ డాలర్లు, హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్ నడార్ 5 బిలియన్ డాలర్లు, ఉదయ్ కోటక్ 4 బిలియన్ డాలర్ల నష్టం వీరి నికర విలువలో ఏర్పడింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లంద‌రూ కోవిడ్-19 సంక్షోభం వల్ల త‌మ సంప‌ద‌ను కోల్పోతున్నట్లు చెప్పుకొచ్చింది.ముఖేష్‌కు రూ.1.44 లక్షల కోట్ల న‌ష్టం...ఎందుకో తెలుసా..!కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో సేవా రంగాలు అమ్మకాలు నిలిచిపోవటం జరిగినట్లు హురున్ గ్లోబల్ రిచ్ సంస్థ చెప్పుకొచ్చింది. కోవిడ్-19 సృష్టించిన సంక్షోభానికి ప్రపంచంలో బలమైన ఆర్థిక దేశాలే ఏం చేయలేని స్థితిలో కి వెళ్లి పోయాయి. దీంతో చాలామంది వరల్డ్ వైడ్ కార్పొరేట్లు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎవరికి వారు విరాళాలు ప్రకటిస్తున్నారు అని ఈ సంస్థ చెప్పుకొచ్చింది.

 

మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల లో కోవిడ్-19 వల్ల నష్టపోయిన వాళ్ళల్లో రెండోస్థానంలో ముకేశ్ అంబానీ ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఇదే సీన్…లాక్ డౌన్ కొనసాగితే ముఖేష్ అంబానీ కొన్ని లక్షల కోట్లు రాబోయే రోజుల్లో నష్టపోయే అవకాశం ఉన్నట్లు కూడా వివరించింది. దీంతో కరోనా వైరస్ బాధితుల కోసం దేశంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ముఖేష్ అంబానీ కి లక్షన్నర కోట్లు నష్టపోయినట్లు వార్తలు సోషల్ మీడియాలో కూడా రావడంతో చాలా మంది నెటిజన్లు పాపం అని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news