వైయస్ జగన్ దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రత్యర్థులతో పోరాడి 2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి అనుకున్నది సాధించారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రం, పైగా అప్పుల రాష్ట్రం అయినా ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో తనకు అత్యంత మెజారిటీ కల్పించిన ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ జగన్ ఇచ్చారు. ఒకపక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి రాష్ట్రంలో జరిగే విధంగా జగన్ పరిపాలన చేస్తున్న టైంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఆర్థికంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ఖజానా కి మరింత చిల్లు పెట్టి నట్లు అయింది. కరోనా వైరస్ ప్రభావంతో ప్రత్యర్థులు వైయస్ జగన్ ను ఇరుకున పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో జగన్ ని బూచిగా చూపించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.కాని కేంద్రంలో మాత్రం జగన్ మాటకి మంచి విలువ ఉందని ఇటీవల కొన్ని పరిణామాలు బట్టి తెలుస్తుంది. స్వయంగా ప్రధాని మోడీ వైయస్ జగన్ కి ఫోన్ చేసి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి తెలుసుకుని అదే విధంగా కరోనా వైరస్ యొక్క తీవ్రత కూడా తెలుసుకోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే టైమ్ లో వైయస్ జగన్ ఫోన్ లో రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఒకేసారి విడుదల చేయాలని ప్రతిపాదించడం దానికి సానుకూలంగా కూడా మోడీ ప్రతిస్పందించడం చూస్తే జగన్ మరియు మోడీల మధ్య బంధం గట్టి పడిందని చాలామంది అంటున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే కరోనా వైరస్ రాకముందే ప్రధాని మోడీ..వైయస్ జగన్ కి ప్రాధాన్యత ఇవ్వటం స్టార్ట్ చేశారు అని చెప్పవచ్చు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో కూడా ఓడిపోవడంతో వెంటనే మోడీ ఆలోచన మారింది. పది నెలల పరిపాలన చేసిన వైయస్ జగన్ పేరు అప్పటికే దేశ స్థాయిలో మారుమ్రోగుతూ ఉండటంతో వెంటనే మోడీ ఢిల్లీకి జగన్ ని పిలిపించుకొని రాజ్యసభ ఎన్నికల్లో కేంద్రానికి సపోర్ట్ ఇవ్వాలని అనేక ఆఫర్లు ఇస్తూ జగన్ కి క్లోజ్ గా ఉండడం జరిగింది. ఇటువంటి టైం లో కరోనా వైరస్ లాంటి మహమ్మారిని దక్షిణాది రాష్ట్రాలలో బలంగా ఎదుర్కొన్న ముఖ్యమంత్రిగా కూడా జగన్ కి పేరు రావడంతో మోడీకి జగన్ పట్ల ఇటీవల మంచి ఇంప్రెషన్ ఏర్పడినట్లే అని చాలామంది అంటున్నారు. పైగా ఏపీకి కావాల్సింది కూడా ఇదే అని..జగన్ మరియు మోడీ మధ్య ఉన్న బంధం బట్టి భవిష్యత్తులో ఏపీకి మంచి కాలమే ఉంది అని చాలామంది అంటున్నారు.