కే‌సి‌ఆర్ – ABN ఆర్‌కే ల మధ్య సరికొత్త ఛాలెంజ్ లు .. ఇది ఎటు దారి తీస్తుంది ?

-

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ కట్టడి విషయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటువంటి టైం లో కొన్ని చిల్లర పత్రికలు పిచ్చి రాతలు రాస్తున్నారని…అవన్నీ అవాస్తవమని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగానే వ్యవహరిస్తే న్యాయపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటారని కూడా హెచ్చరిక చేశారు. అయితే కే‌సి‌ఆర్ ఆ వ్యాఖ్యలు ఏ పత్రికను ఉద్దేశించి చేశారు అన్నది తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతుండగానే..ఏబీఎన్ ఆర్కే తన బుధవారం పత్రిక ఎడిషన్ సంపాదకీయంలో ‘ఏంటా అధిక ప్రసంగం’ అనే హెడ్డింగ్ తో కే‌సి‌ఆర్ కి సవాల్ తరహాలో ప్రశ్నించే విధంగా ఆర్టికల్ రాశారు.KCR-RK War Reaches New Peakదీంతో అందరికి అర్థం అయింది కే‌సి‌ఆర్.. ఏబీఎన్ ఆర్కే పత్రికపై మీడియా సమావేశంలో సెటైర్లు వేశారని. ‘శాపనార్థాలు’ అనే టైటిల్ తో ఏబిఎన్ ఆర్కే తెలంగాణ సీఎం కేసీఆర్‌ నోటిదురుసు కంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా బెటర్ అని తెలిపారు. ఈ సందర్భంలో అమెరికా దేశంలో మీడియా సమావేశం జరుగుతున్న తరుణంలో డోనాల్డ్ ట్రంప్ ఏ విధంగా ప్రముఖ ఛానల్ రిపోర్టర్ ల పై విమర్శలు చేశారు వాటిని ఈ సంపాదకీయంలో ఏబీఎన్ ఆర్కే రాశారు.

మొదటిలో పెట్టిన రెండు మీడియా సమావేశాలకు ప్రజలు జేజేలు కొట్టారని తాజా మీడియా సమావేశంలో రిపోర్టర్ లపై ఎందుకు అంత అదురు పాటు అంటూ కే‌సి‌ఆర్ నీ విమర్శించారు. సరైన వైద్య సదుపాయం అలాగే వైద్యులకు రక్షణ పరికరాలు లేవని ప్రజల తరఫున మీడియా ప్రశ్నిస్తే…రాసిన వాడికి కరోనా రావాలని శాపనార్థాలు పెడతావా? నువ్వు రాజకీయ నాయకుడు వేనా అంటూ ఏబీఎన్ ఆర్కే తన కథనంలో ప్రశ్నించాడు. అమెరికా నుండి చాలా నేర్చుకోవాల్సినవి  ఉండగా ట్రంప్ నోటిదురుసు నేర్చుకుంటావా అంటూ ఎద్దేవా చేశారు. కానీ నీ లాగా డోనాల్డ్ ట్రంప్ మీడియా అధినేతలకు కరోనా వైరస్ రావాలని శాపనార్థాలు పెట్టలేదని సెటైర్లు వేశారు. ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసిన మీడియా తరఫున రాజకీయ నాయకులను నిలదీస్తూనే ఉంటామని ఏబీఎన్ ఆర్కే తెలిపారు. కాగా తాజాగా వచ్చిన ఈ ఏబీఎన్ ఆర్కే ఆంధ్రజ్యోతి వార్తలపై కెసిఆర్ న్యాయపరమైన చర్యలు తీసుకోవటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో పరిస్థితి కే‌సిఆర్ మరియు ఏబిఎన్ ఆర్కే ల మధ్య సరికొత్త ఛాలెంజ్ తరహాలో ఉండటంతో ఈ పరిణామం ఎటు దారితీస్తుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news