భారత్ కి లాక్ డౌన్ ఎలా సాధ్యమవుతుంది…? ప్రపంచం మొత్తం షాక్…!

-

అభివృద్ధి చెందిన దేశాలు లాక్ డౌన్ ప్రకటించడం పెద్ద విషయం కాదు. దాని వలన ఆయా దేశాలకు వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు అన్ని దేశాలు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. చాలా దేశాల్లో అన్ని రంగాలు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి. దీనితో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీనితో ఆర్ధికంగా కష్టాలు పడుతున్నాయి ప్రపంచ దేశాలు.

ఇది పక్కన పెడితే ఇప్పుడు మన దేశం లాక్ డౌన్ ని పెంచడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. తన ప్రజలను కాపాడుకోవడానికి ఇప్పుడు రెడీ అవుతుంది. లాక్ డౌన్ ని మరో రెండు వారాల పాటు పొడిగించడానికి ప్రధాని నరేంద్ర మోడీ… ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇప్పుడు షాక్ అవుతున్నాయి. అసలు ఇది భారత్ కి ఏ విధంగా సాధ్యమవుతుందో ఎవరికి అర్ధం కావడం లేదు.

మన దేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య… ఒక చిన్న దేశ జనాభాతో సమానంగా ఉంటుంది. లాటిన్ అమెరికాలో రెండు మూడు దేశాలతో కలిపితే మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఉంటుంది. అలాంటి దేశం.. దానికి తోడు లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా మొత్తం కలిపితే ఉండే జనాభా కన్నా ఎక్కువగా ఉండే దేశ౦ లాక్ డౌన్ ని ప్రకటిస్తే ఏ విధంగా నిలబడుతుంది అనేది ప్రపంచానికి అర్ధం కావడం లేదు.

మన దేశం కంటే ఆర్ధికంగా చైనా ఎంతో బలమైన దేశం. అయినా సరే ఆ దేశం లాక్ డౌన్ ని ఊహాన్ కి మాత్రమే పరిమితం చేసింది. మన దేశంలో జనాల సంక్షేమ కార్యక్రమాలు చూడాలి, ఉద్యోగుల అవసరాలు, నిర్వహణ ఖర్చులు ఎన్నో ఉంటాయి. అయినా సరే మన దేశం మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఆర్ధిక నిల్వలు కూడా అంతగా లేవు. అమెరికాలో రెండు లక్షలు కేసులు దాటే వరకు ట్రంప్ కి లాక్ డౌన్ ఆలోచన రాలేదు.

కాని మోడీ సర్కార్ మాత్రం ఎక్కడా భయపడలేదు. ఆర్ధిక ఇబ్బందులు కంటే ప్రజల ప్రాణాలు ప్రధానమని భావించే మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు మనని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఐఖ్యరాజ్య సమితి కూడా ఈ పరిణామం చూసి షాక్ అయింది. ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మన దేశ ప్రతినిధులను కూడా అడిగింది.

Read more RELATED
Recommended to you

Latest news