ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కరోనా. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 80 వేలకుపైగా మరణించారు. 15 లక్షలకు పైగా ఈ మహమ్మారి బారిన పడి నానా ఇబ్బందులు పుడుతున్నారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ కొందరు మాత్రం ఆదేశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. పోలీసుల కళ్లుగప్పి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అయితే ఇలాంటి వారికి బుద్ధి చెప్పేందుకు కేరళ పోలీసులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు.
డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపారు. లాక్ డౌన్ ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ఒక్కసారిగా డ్రోన్ కెమెరాలు కనిపించడంతో రోడ్లపై ఉన్న ప్రజలు షాక్ తిన్నారు. డ్రోన్ కెమెరా కంటికి చిక్కకుండా పరుగులు తీశారు. ముఖాన్ని షర్టులో దాచుకుని పరిగెత్తారు. కెమెరా కంట పడకుండా వారు పడిన పాట్లను చూస్తే నవ్వాపుకోలేరు.
ఇంట్లో ఉండమంటే ఎందుకొచ్చిన తిప్పలివని అనకుండా ఉండలేరు. అయితే ఇలా వేర్వేరు ప్రాంతాల్లో రికార్డు చేసిన వీడియోలను అన్నింటిని కలిపిన కేరళ పోలీసులు వాటిని ఎడిట్ చేశారు. దీనికి 2016లో పాపులర్ అయిన రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, ఇయాన్ బోథమ్ ల ట్రేసర్ బుల్లెట్ చాలెంజ్ కామెంటరీ ఆడియోని జోడించి కేరళ పోలీసు శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోను మీరూ చూసేయండి.
Drone sightings during lockdown… pic.twitter.com/kN3a4YCJ5D
— Kerala Police (@TheKeralaPolice) April 7, 2020