కరోనా వేళ పాక్ కి చుక్కలు చూపించిన భారత్…!

-

ఒక పక్క కరోన వైరస్ తో ఇబ్బంది పడుతున్నా మన దేశం మీద ఉగ్రవాదులను రెచ్చ గొడుతూ దాడులకు దిగుతున్న పాకిస్తాన్ మీద భారత్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. సరిహద్దుల నుంచి పాక్ భూభాగం లోకి వెళ్లి మరీ పాకిస్తాన్ పై దాడులకు దిగింది భారత్. నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలనే కాకుండా పేలుడు పదార్ధాలను భద్రంగా దాచిన ప్రదేశాలను టార్గెట్ చేసింది. శుక్రవారం భారత్ ఈ కాల్పులకు దిగడ౦తో పాక్ ఉక్కిరి బిక్కిరి అయింది.

కుప్వారా జిల్లా కెరన్‌ సెక్టార్‌ నుంచి శతఘ్నులతో భారత్ గురి పెట్టింది. ఈ దాడుల్లో పాక్ భారీగా నష్టపోయిందని సైనిక వర్గాలు మీడియాకు వివరించాయి. మన దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదని మన సైనికులు ఎవరికి చిన్న గాయం కూడా కాలేదు అని ఆర్మీ పేర్కొంది. నీలమ్‌ లోయలోని కెల్‌ ఉగ్రవాద శిబిరాలను భారత్ టార్గెట్ చేసి ఈ కాల్పులకు దిగింది. కెరన్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు వస్తే వారిని అడ్డుకోవడం కష్టమవుతుంది అని భావించిన భారత బలగాలు నిఘా వర్గాల సమాచారం తో దాడులకు దిగాయి.

అందుకే వాళ్ళను పూర్తిగా భారత్ టార్గెట్ చేసి ఈ దాడులు చేసింది అంటున్నారు. ఈ కాల్పుల్లో ఎంత మంది చనిపోయారు అనేది తెలియలేదు. నాలుగు రోజుల క్రితం ఇదే సెక్టార్ లో భారీ కాల్పులు జరగగా అందులో 5 నుంచి 10 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ కాల్పుల్లో దాదాపు 30 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పాక్ ఉల్లంఘిస్తే అదే స్థాయిలో సమాధానం చెప్తామని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news