సాహో తో ఎంత దెబ్బ తిన్నానో నాకు తెలుసు అయినా అందరూ నా వెనకపడుతున్నారెందుకు ..?

-

 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఫ్రాంఛైజీ కి ముందు ఉన్న క్రేజ్ కేవలం టాలీవుడ్ లో మాత్రమే. కాని బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత మాత్రం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాహుబలి రెండు భాగాలకు గాను ప్రభాస్ దాదాపు నాలుగేళ్ళు అన్ని విధాలుగా శ్రమించాడు. దాని ప్రతిఫలమే ఈ పాన్ ఇండియా స్టార్ క్రేజ్. యూనివర్సల్ స్టార్ గా అన్ని భాషల్లోను ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళు టాలీవుడ్ లో మరెవరూ లేరన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రభాస్ కి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చాయి. కాని ఎందుకనో ఆ ఆఫర్స్ ని ప్రభాస్ సున్నితంగా తిరస్కరించాడు.

 

కాని తెలుగులో తను తీస్తున్న సినిమాలు మాత్రం యూనివర్సల్ అపిల్ ఉండేలా పాన్ ఇండియా రేంజ్ లోనే నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిర్మించిన భారీ బడ్జెట్ సినిమానే సాహో. అయితే ఈ సినిమా ప్రభాస్ కి గట్టి షాకిచ్చింది. చెప్పాలంటే ఒక్క బాలీవుడ్ లో తప్ప మిగతా భాషల్లో ఫ్లాప్ గా మిగిలింది. అయినా మరోసారి పాన్ ఇండియా ప్రయత్నమే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కూడా పాన్ ఇండియా సినిమాగానే రూపొందుతుంది. కాని సాహో దెబ్బకి ఈ ఇమేజ్ కాపాడుకోగలనా అన్న అనుమానం గట్టిగా పడింది.

 

ఇక ప్రభాస్ క్రేజ్ చూసే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరు తమ దర్శకులకి ఏ సినిమా చేసినా ప్రభాస్ లా పాన్ ఇండియా సినిమాగానే ఉండాలని కోరుతున్నారట. ఈ క్రేజ్ లో ఇప్పటికే రాజమౌళి ఎన్.టి.ఆర్ రాం చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ కేటగిరీలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి మంచి సక్సస్ ని అందుకుంది. కాని పాన్ ఇండియా సినిమా అన్న క్రేజ్ ని మాత్రం దక్కించుకోలేపోయింది. ఇక మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు వచ్చాయి గాని ఆ రేంజ్ సినిమాలు కాదు. అయితే ఇప్పుడు మహేష్ బాబు కూడా ఆ తరహా కథలకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట.

 

ఇక రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అల్లు అర్జున్ పుష్ప కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే సినిమా అనే అంటున్నారు. అందుకు క్లారిటి ఇస్తూనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని 5 భాషల్లో రిలీజ్ చేశారు. ఒక రకంగా ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ కి కాస్త పోటీగానే దిగబోతుందని తెలుస్తుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా ని పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలని ప్లాన్స్ తోనే మహేష్ బాబు తో కమిటయ్యారని తెలుస్తుంది.

 

ఆచార్య లో మెగాస్టార్ తో పాటు మహేష్ బాబు కలిసి నటించడం దాదాపు కన్‌ఫర్మ్ అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మహేష్ బాబు కాకపోయినా రాం చరణ్ మాత్రం ఖచ్చితంగా నటిస్తాడని సమాచారం. మొత్తానికి టాలీవుడ్ హీరోలందరూ ఇలా పాన్ ఇండియా స్టార్స్ గా పాపులారిటీని సంపాదించుకోవాలని ఉబలాటపడటం బాగానే ఉన్నప్పటికి ఆ క్రేజ్ ని నిలుపుకోవడం కూడా అసాధ్యం. ఇప్పుడు ఇదే మాట ప్రభాస్ అంటున్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news