ఏప్రిల్ 30 వరకు తెలంగాణాలో లాక్ డౌన్; కేసీఆర్

-

తెలంగాణా రాష్ట్ర కేబినేట్ సమావేశం ముగిసిన అనంతరం సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కరోనా కేసులు లాక్ డౌన్ పరిస్థితులపై, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మంత్రి వర్గం చర్చించింది. అనంతరం మాట్లాడిన కేసీఆర్… క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు 1654 మంది ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 503 కి చేరుకుందని కేసీఆర్ పేర్కొన్నారు. 96 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన వివరించారు.

మొత్తం రాష్ట్రంలో 393 కేసులు యాక్టివ్ గా ఉన్నారని ఆయన వివరించారు. మార్కాజ్ నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేసామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన 34 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. మర్కాజ్ నుంచి వచ్చిన వారు 1200 మందికి టెస్టులు చేసామని అన్నారు. ఇప్పటి వరకు ఎవరికి సీరియస్ గా లేదని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 24 తర్వాత తెలంగాణాలో కరోనా ఉండదని అన్నారు.

కొత్త కేసులు రాకపోతే మనం పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుందని అన్నారు. ఏప్రిల్ 30 వరకు తెలంగాణాలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నామని అన్నారు. మహారాష్ట్రలో ఒకే రోజు 11 మంది చనిపోయారని అన్నారు. మహారాష్ట్ర తో తెలంగాణకు సుదీర్ఘ సరిహద్దు ఉందన్న ఆయన… ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. తెలంగాణాలో కంటైన్మేంట్ జోన్ లు 243 గా గుర్తించామని చెప్పారు.

విద్యార్ధుల తల్లి తండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఒకటి నుంచి 9 వ తరగతి వరకు పై తరగుతులకు ప్రమోట్ చేస్తున్నామని అన్నారు. పదో తరగతి పరిక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఏప్రిల్ 30 తర్వాత దశల వారీగా లాక్ డౌన్ ని ఎత్తేస్తామని దయచేసి ప్రజలు అందరూ కూడా దీనికి సహకరించి నాలుగు రోజులు ఓపిక పట్టాలని ఆయన కోరారు. ఏప్రిల్ 15 వరకు నీళ్ళు అందిస్తామని చెప్పారు.

కనీసం రెండు వారాలు లాక్ డౌన్ ని పోడిగించాలని అన్ని రాష్ట్రాలు కోరాయని కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ని రెడ్ జోన్ లకు హాట్ స్పాట్ లకు పరిమితం చెయ్యాలని కోరినా సరే ఒప్పుకోలేదని, రైళ్ళు అనుమతించాలని కోరినా సరే ఎలాంటి పరిస్థితుల్లో కూడా లేదని ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని మోడీ చెప్పారని కేసీఆర్ వివరించారు. నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలని మోడిని కోరామని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news