మానవ జాతి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు; కేసీఆర్

-

తెలంగాణా సిఎం కేసీఆర్ కేబినేట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా మానవ జీవితంలో రాలేదని, 1918లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని కేసీఆర్ అన్నారు. మన దేశ జీడీపీ 203 లక్షల కోట్లు అని ప్రస్తుతం క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానం చాలా అవసరం అని అన్నారు. లాక్ డౌన్ కాలానికి సంబంధించి కేంద్రానికి కొన్ని విజ్ఞప్తులు చేసామని అన్నారు.

ప్రస్తుతం క్యూఈ విధానం చాలా అవసరమని అని ఆయన అభిప్రాయపడ్డారు.కేబినేట్ నిర్ణయాలు, డిమాండ్ లపై మోడికి లేఖ రాస్తామని అన్నారు. హెలికాప్టర్ మనీ ద్వారానే ఇప్పుడు ఆర్ధిక పరిస్థితిని ఎదుర్కొంటామని అన్నారు. ఇప్పుడు కేంద్రం వద్ద గాని రాష్ట్రాల వద్ద గాని డబ్బు లేదని ఆయన పేర్కొన్నారు. క్యూఈ విధానం చాలా ఉపయోగకరం అని ఆయన అభిప్రాయపడ్డారు. జీడీపీలో 5 శాతం హెలికాప్టర్ మనీకి కేటాయించాలని అన్నారు. 2008 లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందని గుర్తు చేసారు.

చాలా దేశాల కంటే మన దేశం పరిస్థితి చాలా బాగుందని మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఏప్రిల్ 30 తర్వాత దేశంలో ఈ మహమ్మారి ఉండకూడదు అని దేవుడ్ని ప్రార్దిస్తున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని 5 లేదా 6 శాతం పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. కరోనా నియంత్రణలో అన్ని దేశాల కంటే మన దేశం ముందు ఉందని, దీనికి ప్రజల సహకారమే చాలా కీలకం అయిందని అభినందించారు.

కేంద్ర ప్రభుత్వం తో కలిసి కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నామని అన్నారు. 135 కోట్ల జనాభా తో పోలిస్తే మనం చాలా కంట్రోల్ గా ఉంచామని అన్నారు. రాష్ట్రాలకు ఇచ్చిన అప్పులకు సంబంధించి పరిమితిని ఆరు నెలల పాటు వాయిదా వెయ్యాలని, ఈ పరిస్థితి ఎప్పుడూ లేదని కాబట్టి సహకరించాలని కోరినట్టు ఆయన పేర్కొన్నారు. ఆహార రంగంలో మన స్వీయ సంవృద్ది సాధించామని పేర్కొన్నారు. ఇంకొన్ని రోజులు పజలు ఓపిక పడితే బయట పడినట్టే అని అన్నారు.

ప్రజలు కచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ పనులకు లాక్ డౌన్ ని మినహాయిస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సమయానుకూలంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అందరూ కలిసి ఒకే తాటి మీదకు వస్తే కంట్రోల్ చేస్తామని, అమెరికా లాంటి దేశమే ఇప్పుడు సతమవుతు౦దని, అన్ని సక్రమంగా ఉన్న దేశమే ఇబ్బందులు పడుతుందని, మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news